Honeybees attack on Sharmila: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బృందంపై తేనెటీగల దాడి జరిగింది. ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమెపై తేనెటీగలు దాడి చేయడం కలకలం రేపింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం దుర్సగనిపల్లిలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు వారిపైకి దూసుకొచ్చాయి.
పాదయాత్రలో వైఎస్ షర్మిలపై తేనెటీగల దాడి.. - honey bees attack on ys sharmila
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బృందంపై తేనెటీగల దాడి జరిగింది. తెలంగాణలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమెపై తేనెటీగలు దాడి చేయడం కలకలం రేపింది.

వైఎస్ షర్మిల
తేనెటీగలు దాడి చేస్తున్నప్పటికీ.. షర్మిల తన పాదయాత్రను ఆపలేదు. అదే అంకితభావంతో యాత్రను కొనసాగించారు. ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పార్టీ శ్రేణులు తమ కండువాలనే గాల్లోకి ఊపుతూ తేనెటీగలను తరిమేశారు.
ఇదీ చదవండి:ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద.. తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు!