ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్ నివాసం సమీపంలో.. నిర్వాసితుల ఆందోళన - సీఎం జగన్ నివాసం

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద ఉంటున్న పేదలు.. తమకు అన్యాయం చేశారంటూ ఇళ్లముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.

homeless residents protest at cm residence
ఇళ్ల నిర్వాసితుల ఆందోళన

By

Published : Jul 18, 2021, 10:31 AM IST

సీఎం జగన్ నివాసం సమీపంలో.. ఇళ్ల నిర్వాసితుల ఆందోళన

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద ఉంటున్న పేదలు... వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సీఎం భద్రత దృష్ట్యా...అమరారెడ్డినగర్ వాసులను ఖాళీ చేయించి ఆత్మకూరులో ఇళ్లస్థలాలు కేటాయించారు. పరిహారం పంపిణీలో స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డితోపాటు మరికొందరు నేతలు తమకు అన్యాయం చేశారంటూ ఇళ్లముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. స్థలాల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details