ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీస్​ డ్రెస్​..ప్రభుత్వం నిర్ణయం - Women police in ward secretariats

గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి పేరు.. ఇకపై మహిళా పోలీస్​గా మారనుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణ మహిళా పోలీసు తరహాలోనే వీరికి యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Women Police
మహిళా పోలీస్​

By

Published : Jun 23, 2021, 4:24 PM IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని మహిళా పోలీసుగా నిర్ధారిస్తూ.. హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ ఇచ్చారు. మహిళా కానిస్టేబుళ్లకు ఇచ్చిన తరహాలోనే మహిళా పోలీసు కార్యదర్శులకు యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ చట్టాల కింద పోలీసులకు ఇచ్చిన అధికారాలను కూడా మహిళా పోలీసులకు వర్తింపజేయనున్నారు.

సమీప పోలీసు స్టేషన్​కు జవాబుదారీగా గ్రామ, వార్డు మహిళా పోలీసు సిబ్బంది పని చేయనున్నారు. మహిళా పోలీసు సిబ్బందికి పదోన్నతులుగా అదనపు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ జారీ చేశారు.

ఇదీ చదవండీ..నూజివీడు సబ్ కలెక్టర్ అంతర్రాష్ట్ర బదిలీ

ABOUT THE AUTHOR

...view details