ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ లో పడిపోతున్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు.. - హైదరాబాద్ లో ఇళ్ల ధరలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోతున్నాయి. గడిచిన నెల రోజుల్లో కేవలం రూ.2,100 కోట్ల విలువైన లావాదేవీలు మాత్రమే జరిగాయి. గతేడాది పోలిస్తే 55 శాతం.. జూన్‌ నెలతో పోలిస్తే కేవలం 20 శాతం మేర ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఈ ఏడాది మొత్తంగా చూస్తే.. 20 వేల 23 కోట్ల రూపాయలు విలువచేసే 40,897 గృహ యూనిట్లు అమ్ముడుపోయినట్లు నైట్‌ ఫ్రాంక్‌ అనే సంస్థ వెల్లడించింది.

felldown housing registrations
felldown housing registrations

By

Published : Aug 11, 2022, 4:34 PM IST

felldown housing registrations

హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. గత ఏడాది జులైలో 9507 ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూలైలో 55 శాతం తగ్గి కేవలం 4313 ఇళ్లు మాత్రమే విక్రయాలు జరిగాయి. అలాగే గత ఏడాది జులైలో రూ.4572 కోట్లు విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది జులైలో 54 శాతం తగ్గి రూ.2100 కోట్లు విలువ చేసే ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే.. ప్రతి నెల అంతకుముందు ఏడాదిలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే తక్కువగా జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

జూలైలో విక్రయాలు జరిగిన ఇళ్లలో రూ.25లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య విలువ చేసే ఇళ్లు అత్యధికంగా 56 శాతం, వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గృహాలు అత్యధికంగా 72 శాతం అమ్ముడుపోయినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రూ.50 లక్షలు లోపు విలువ చేసే ఇళ్ళు అంతకు ముందు ఏడాది 34 శాతం ఉండగా.. ఈ సంవత్సరం 56 శాతానికి ఎగబాకాయి. విస్తీర్ణం విషయంలో ఎలాంటి మార్పు కనబర్చలేదు.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో జిల్లాల వారిగా జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యధికంగా 41 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. హైదరాబాద్‌ జిల్లాలో 15 నుంచి 16 శాతానికి ఎగబాకగా.. రంగారెడ్డి జిల్లాలో 42 శాతం నుంచి 38 శాతానికి పడిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది జులైలో జరిగిన 5 శాతం రిజిస్ట్రేషన్లే ఈ ఏడాది జరిగాయి. జిల్లాల వారిగా ధరలను పరిశీలిస్తే.. ఒక్కో చదరపు అడుగుపై 9 శాతం పెరిగి సగటున చదరపు అడుగుకి రూ.3553 ఉంది. హైదరాబాద్‌లో 10 శాతం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 20 శాతం, రంగారెడ్డిలో 5 శాతం, సంగారెడ్డిలో 27 శాతం లెక్కన ధరలు పెరిగినట్ల నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించింది.

ఇవీ చదవండి: ఎంపీ గోరంట్ల మాధవ్​ను.. కాపాడాలనేదే ప్రభుత్వ ఉద్దేశం
హైదరాబాద్​కు పాక్ యువతి.. వయా నేపాల్ సరిహద్దు.. అరెస్టు

ABOUT THE AUTHOR

...view details