రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ ఉద్యోగికి కరోనా రావడం వల్ల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లో విధులు నిర్వహించే వ్యవసాయశాఖ ఉద్యోగులకు హోం క్వారంటైన్ సూచిస్తూ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 14 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సచివాలయంలో కరోనా కలకలం... హోంక్వారంటైన్కు వ్యవసాయ శాఖ ఉద్యోగులు - కరోనా వార్తలు
రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. ఈ క్రమంలో ఆ శాఖ ఉద్యోగులు హోం క్వారంటైన్లో ఉండాలంటూ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ సచివాలయంలో కరోనా కలకలం