అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశంపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. అమరావతి రాజధానికి భూములు ఇవ్వమన్నప్పుడు రైతులు మొదట వ్యతిరేకించారని.. ఆ తరువాత అర్థం చేసుకొని భూములిచ్చారన్నారు.
ACCMC: ' ఇప్పుడు వ్యతిరేకించినా.. తర్వాత అర్థం చేసుకుంటారు' - MINISTER SUCHARITHA
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై ఇప్పుడు రైతులు వ్యతిరేకించినా.. తర్వాత అర్థం చేసుకొని సహకరిస్తారని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హోం మంత్రి పలికారు.
home minster sucharitha comments on ACCMC
ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమం చేస్తున్నారన్నారు. మేలు చేస్తామని చెప్పినప్పుడు మొదట వ్యతిరేకించినా.. ఆ తర్వాత అర్థం చేసుకొని సహకరిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా రైతులకు ఏంకావాలో చెప్పాలని అడుగుతోందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హోంమత్రి సుచరిత సూచించారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి హాజరైన సుచరిత ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి: