ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ గోరంట్ల ఎపిసోడ్.. అనుమానం ఉంది : హోంమంత్రి వనిత - MP Gorantla Video issue

MP Gorantla Video issue: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. మాధవ్ కు చెందినదిగా చెబుతున్న వీడియో ప్రస్తుతం.. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనలో ఉందని.. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

vanitha
vanitha

By

Published : Aug 9, 2022, 6:17 PM IST

Updated : Aug 9, 2022, 6:28 PM IST

Home minister Vanitha on Gorantla issue: అధికార వైకాపా ఎంపీ గోరంట్లకు సంబంధించినదని వైరల్ అయిన వీడియో వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. ఎంపీ మాధవ్ కు చెందినదిగా చెబుతున్న వీడియోలో.. రాజకీయ కుట్ర ఉందని అనుమానం కలుగుతోందని వనిత అన్నారు. ఇదే విషయాన్ని మాధవ్ కూడా చెప్పారని అన్నారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని.. ఎంపీ మాధవ్ ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే.. మాధవ్ కు సంబంధించినది చెబుతున్న వీడియోగా.. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ విచారణలో ఉందని తెలిపారు. నిపుణులు పర్యవేక్షిస్తున్నారని.. త్వరలోనే ఫోరెన్సిక్ నివేదిక వస్తుందని చెప్పారు. ఆ వీడియో నిజమైనదే అని తేలితే.. తప్పకుండా శిక్ష పడుతుందని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి వనిత అన్నారు.

ఇక, ఈ వ్యవహారంలో ఎంపీ మాధవ్ ను ప్రభుత్వం రక్షించాలని చూస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మాధవ్‌ను ప్రభుత్వం రక్షించడం లేదని స్పష్టంగా చెప్పామని.. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత అన్ని విషయాలూ తెలుస్తాయని అన్నారు. మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన హోం మంత్రి.. "దిశ" యాప్ ద్వారా రాష్ట్రంలో 900 మహిళలను రక్షించామని చెప్పారు.

ఇవీ చదవండి :

Last Updated : Aug 9, 2022, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details