చంద్రబాబు సభపై రాళ్ల దాడి ఘటనపై హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దాడి జరిగిందనడం అవాస్తవమన్నారు. సానుభూతి కోసం రాళ్ల దాడి జరిగినట్లు చిత్రీకరించారని విమర్శించారు. రాళ్ల దాడి చేయాల్సిన అవసరం వైకాపాకు లేదని స్పష్టం చేశారు. వైకాపా అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలే వైకాపా అభ్యర్థిని గెలిపిస్తాయని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసును కూడా భూతద్దంలో చూపిస్తున్నారని.. త్వరలోనే నిజానిజాలు బయటకొస్తాయని చెప్పారు.
చంద్రబాబు సభపై రాళ్ల దాడి అవాస్తవం: హోంమంత్రి సుచరిత - attack on chandrababu
చంద్రబాబు సభపై రాళ్ల దాడి ఘటన అవాస్తమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సానుభూతి కోసం రాళ్ల దాడి జరిగినట్లు చిత్రీకరించారని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికలో సంక్షేమ పథకాలే వైకాపా అభ్యర్థిని గెలిపిస్తాయని స్పష్టం చేశారు.
home minister sucharitha