ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Home Minister Sucharitha: రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదు: హోంమంత్రి - హోంమంత్రి సుచరిత

రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. ఈ విషయంలో అధికార పార్టీపై బురద చల్లడానికి తెదేపా నేతలు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Home Minister Sucharitha
Home Minister Sucharitha

By

Published : Nov 8, 2021, 5:44 PM IST

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రశాంతంగా జరుగుతుందని.. అధికార పార్టీపై బురద చల్లడానికే తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత(minister sucharitha comments on farmers maha padayatra news) అన్నారు. విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ పుట్టినరోజు పురస్కరించుకుని.. గుంటూరు జ్వరాల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పండ్లు, కాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిబంధనలకు లోబడి అమరావతి రైతులు పాదయాత్ర చేయాలని, ఉల్లంఘన జరిగితే నోటీసులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎంత తగ్గించారో లోకేశ్ చెప్పాలన్నారు. ఆయన విమర్శలను ఎవరూ పట్టించుకోరన్నారు.

'రైతుల పాదయాత్రను ఎవరూ, ఎక్కడా అడ్డుకోలేదు. నిబంధనలకు లోబడి రైతులు పాదయాత్ర చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు నోటీసులు ఇస్తారు. పాదయాత్ర చేస్తూనే ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారు. పెట్రో ధరలు.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం' - మేకతోటి సుచరిత, రాష్ట్ర హోంశాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details