దిశ హత్యకేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు. నిందితుల ఎన్కౌంటర్పై ఆమె స్పందించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేయడం వల్ల పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని ఉద్ఘాటించారు. ఇటువంటి సంఘటనల వల్లే దిశ లాంటి ఉదంతాలు పునరావృతం కావని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు పుడుతుంటాడని 'పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అనే భగవద్గీత శ్లోకాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
సంభవామి యుగేయుగే : హోమంత్రి సుచరిత - home minister respond on disha accused encounter news
దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పందించారు. దిశ హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోయిందని అన్నారు. దిశకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
దిశ మృగాళ్ల ఎన్కౌంటర్పై హోంమంత్రి స్పందన
ఇదీ చదవండి:
Last Updated : Dec 6, 2019, 11:19 AM IST