విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాని మోదీని కలిసి కోరితే బాగుండేదని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. ఆయన దాని కోసం చేయాల్సింది దీక్షలు కాదని హితవు పలికారు. భాజపాతో కలిసి పని చేస్తున్న ఆయన ఈ అంశంపై దిల్లీ వెళ్లి పీఎంతో మాట్లాడి ప్రైవేటీకరణను ఆపితే సంతోషిస్తామన్నారు. గుంటూరులో ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తెదేపా ఎంపీలు రాజీనామా చేస్తారని చంద్రబాబు చెప్పటం రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. గతంలో ప్యాకేజీకి ఒప్పుకొని ప్రత్యేక హోదాను విస్మరించారని దుయ్యబట్టారు.
home minister comments on pawan kalyan: 'దీక్ష కాదు.. ప్రధాని మోదీతో చర్చించాలి' - ysrcp
పవన్ సంఘీభావ దీక్షపై హోంమంత్రి సుచరిత విమర్శలు చేశారు. భాజపాతో పొత్తులో ఉన్న పవన్.. దీక్ష కన్నా దిల్లీ వెళ్లి పీఎంతో మాట్లాడి ప్రైవేటీకరణను ఆపితే మంచిదని సూచించారు.
home minister comments on pawan kalyan