విద్యుత్ వినియోగదారులకు ఇంధన సామర్థ్య గృహోపకరణాలను అందించడానికి నిర్దిష్టమైన ఫైనాన్సింగ్ మోడల్‌ను రూపొందించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ఆదేశించారు. ఆసియాలో ప్రముఖ పరిశోధన సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ), డిస్కంల సీఎండీలతో ఆయన చర్చించారు.
‘ఇంధన సామర్థ్య గృహోపకరణాల వినియోగంతో ఇంధన పొదుపు జరిగి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. ఆదా చేసిన మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు. దీనివల్ల డిస్కంలపై ఆర్థిక భారం ఉండదు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తిస్తుంది’ అని పేర్కొన్నారు. సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే ఇంధన సామర్థ్య ఫ్యాన్లు సగం విద్యుత్‌నే వినియోగిస్తాయని సీఈఈడబ్ల్యూ సీనియర్ లీడ్ శాలు అగర్వాల్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘సూపర్ ఎఫీషియంట్ ఫ్యాన్లను వినియోగించడం వల్ల రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లలో 7వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి, డిస్కంలకు రూ.4,500 కోట్లు ఆదా అవుతాయి’ అని పేర్కొన్నారు.
త్వరలో ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలు