1 నుంచి 9వ తరగతి వరకు సెలవులు.. పది, ఇంటర్ పరీక్షలు యథాతథం - corona cases in ap
15:32 April 19
కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది. నేటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని.. ఈ ఏడాది విద్యా సంవత్సరం పూర్తయినట్లు మంత్రి స్పష్టం చేశారు.
షెడ్యూల్ ప్రకారమే పది, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా నిబంధనలు జాగ్రత్తగా పాటిస్తూనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గతేడాది చాలా మంది విద్యార్థులు నష్టపోయారని.. గతేడాది పది పరీక్షల రద్దు వల్ల మిలిటరీ ఉద్యోగార్థులు నష్టపోయారని తెలిపారు. పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు పాటించామన్నారు.
ఇదీ చదవండి:కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి