కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుండటంతో... ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేశారు. నేటి నుంచి ఆదివారం వరకు 4రోజులపాటు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
హైకోర్టుతోపాటు విజయవాడ, మచిలీపట్నం మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. హైకోర్టులోని అన్ని కార్యాలయాల్లో శానిటైజర్స్, హ్యండ్ వాష్‌లు అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో సూచించారు.