సిట్‌కు విభాగాధిపతి హోదా కల్పిస్తూ .. ఉత్తర్వులు - సిట్‌కు హెచ్‌వోడీ హోదా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాల దర్యాప్తునకు ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్( ప్రత్యేక దర్యాప్తు బృందానికి) విభాగాధిపతి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నేరుగా నిధులు వినియోగించుకోవచ్చని ఆదేశాల్లో తెలిపింది.
ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్‌కు విభాగాధిపతి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నిధుల వినియోగానికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా సిట్‌కు హెచ్ఓడీ హోదాను కల్పిస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. కేసుల దర్యాప్తు, కార్యాలయ ఏర్పాటు, ఫర్నిచర్ వంటి ఖర్చులకు నేరుగా నిధుల వినియోగానికి సిట్‌కు అనుమతి ఇస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సిట్ కు నేరుగా హోం శాఖ నుంచే నిధుల విడుదల జరిగేది. ఇకపై నేరుగా నిధులను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించటంతోపాటు ఐజీ హోదాలో సిట్ కు నేతృత్వం వహిస్తున్న అధికారికి నిధుల వినియోగానికి సంబంధించి అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.