ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HOCKEY PLAYER RAJANI: హాకీ క్రీడాకారిణి రజనికి రూ.25 లక్షలు ప్రోత్సాహకం

హాకీ క్రీడాకారిణి రజని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రజనీని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన ఆమెకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు.

Amaravati news: సీఎం జగన్‌ను కలిసిన హాకీ క్రీడాకారిణి రజని
Amaravati news: సీఎం జగన్‌ను కలిసిన హాకీ క్రీడాకారిణి రజని

By

Published : Aug 11, 2021, 4:59 PM IST

Updated : Aug 11, 2021, 5:48 PM IST

రాష్ట్రానికి చెందిన హాకీ క్రీడాకారిణి రజని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రజనీని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన ఆమెకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ.25లక్షల నగదు ప్రోత్సాహకం, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తిరుపతిలో వెయ్యి గజాల స్థలం, నెలకు రూ.40వేల ఇన్సెంటివ్‌ ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్‌ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఈమె పాల్గొన్నారు. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో పాల్గొని ప్రతిభ కనబరిచారు.

ఇదీ చదవండి:

సన్​రైజర్స్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. వార్నర్ వచ్చేస్తున్నాడు

Last Updated : Aug 11, 2021, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details