ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Uppal bhagayath: మళ్లీ భూముల విక్రయం.. హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌..!

ఉప్పల్‌ భగాయత్‌లో మిగిలిన భూములనూ విక్రయించేందుకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ లేఅవుట్లకు సమీపంలో పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతుండడంతో ఈసారి దాదాపు రూ.800 కోట్లకు పైగా రాబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Uppal bhagayath
Uppal bhagayath

By

Published : Nov 6, 2021, 12:05 PM IST

Updated : Nov 6, 2021, 1:18 PM IST

గతంలో ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఉప్పల్‌ భగాయత్‌లో రైతుల నుంచి 733 ఎకరాలను హెచ్‌ఎండీఏ సేకరించింది. మెట్రో రైలుకు 104 ఎకరాలు, ఇతర సంస్థలకు కొంత కేటాయించి.. 400 ఎకరాల్లో మొదటి దశలో భారీ లే-అవుట్‌ అభివృద్ధి చేసింది. ఇందులోనే.. భూములిచ్చిన రైతులకు పరిహారంగా కొన్ని ప్లాట్లను కేటాయించింది. రెండో దశ లే-అవుట్‌ను మరో 70 ఎకరాల్లో అభివృద్ధి చేసి 2018, 2019 ఏప్రిల్‌లో విక్రయించారు. 2019 డిసెంబరులో ఫేజ్‌-1లోని 124 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. మొత్తం మీద ఈ-వేలం ద్వారా రూ.1050 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇవి పోగా మిగిలిన కొంత స్థలాన్ని లే-అవుట్‌గా మార్చి ప్రస్తుతం విక్రయించనున్నారు.

ప్రస్తుతం 44 ప్లాట్లను వేలానికి ఉంచారు. వీటిలో 10వేలు, 15వేల గజాల ప్లాట్లూ ఉన్నాయి. గతంలో అత్యధికంగా గజానికి రూ.82 వేలు పలకగా.. ఈసారి వాణిజ్య, అంతర్జాతీయ బిడ్డర్ల రాకతో పెద్దఎత్తున వసూళ్లొస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్లాట్ల సైజుని బట్టి 300 గజాల వరకు రూ.3 లక్షలు ఈఎండీ చెల్లించాల్సి ఉండగా.. 310-500 గజాల వరకు రూ.5 లక్షలు, 501-1000 గజాల వరకు రూ.7.50 లక్షలు, 1001-2000 గజాల వరకు రూ.10 లక్షలు, 2001పైన రూ.15 లక్షలు ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది.

భారీగా ఆదాయం!
హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థకు భూముల విక్రయాలు కలిసొస్తున్నాయి. 2018 ఏప్రిల్‌లో తొలి వేలానికి ఔత్సాహికుల నుంచి మంచి స్పందన రాగా రూ.350 కోట్లకు 189 ప్లాట్లు అమ్ముడుపోయాయి. చ.గజం కనీస ధర రూ.20 వేలు నిర్ణయించగా.. అత్యధికంగా అత్తాపూర్‌లో రూ.1.53 లక్షలు పలికింది. తర్వాత మాదాపూర్‌లో గజం రూ.1.52 లక్షలు, షేక్‌పేట్‌లో రూ.1.20 లక్షలు కోట్‌ చేశారు. తర్వాతి పరిణామాలతో రూ.300కోట్ల దాకా ఖజానాకు చేరాయి.

ఆ తర్వాత కోకాపేట్‌లో మొత్తం 719 ఎకరాలను ప్రభుత్వం అప్పగించగా.. ‘గోల్డ్‌ మైల్‌’ పేరిట అభివృద్ధి చేసిన లే-అవుట్లో 163 ఎకరాలను 2006లో అమ్మితే రూ.1753 కోట్ల ఆదాయం వచ్చింది. వివిధ సంస్థలు, మౌలిక సదుపాయాల కేటాయింపులకు పోనూ మిగిలిన 110 ఎకరాల్లో ‘నియో పోలీస్‌’ పేరిట మరో లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. ఇటీవల 49.94 ఎకరాలకు ఈ-వేలం నిర్వహించగా రూ.2వేల కోట్లకు పైగా సమకూరింది.

ఈ-వేలం ఇలా..

బ్రోచర్‌ వివరాలకు : https://auctions.hmda.gov.in

ఫ్రీ బిడ్‌ సమావేశం: నవంబరు 15వ తేదీ, ఉదయం 11గంటలకు

రిజిస్ట్రేషన్‌కు తుది గడువు: నవంబరు 30వ తేదీ, సాయంత్రం 5గంటల దాకా

ఈఎండీ చెల్లింపునకు తుది గడువు: నవంబరు 30వ తేదీ, సాయంత్రం 5గంటల దాకా

ఈ-వేలం జరిగేది: డిసెంబరు 2, 3 తేదీల్లో ఉదయం 9గంటలకు

పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ రుసుము: రూ.1000

చ.గజానికి నిర్ధారిత ధర: రూ.35వేలు

ఇదీ చదవండి:

MISSING: బద్వేలులో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు అదృశ్యం..ఏమయ్యారు?

Last Updated : Nov 6, 2021, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details