అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడని ఓ బాలుడిని అతని పెదనాన్న విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మల్కాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన బాలయ్య కూతురి తోటి కోడలి కుమార్తెకు అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడని తన తమ్ముడి కుమారుడు భీమయ్యను(14) బాలయ్య చితకబాదాడు. కాళ్లను తాడుతో కట్టి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ)లో చోటుచేసుకుంది. అనంతరం కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా... మళ్లీ ఇలాంటి తప్పు చేయనని బాధిత బాలుడు క్షమాపణ చెప్పడంతో తల్లిదండ్రులకు అప్పగించారు. చితకబాదుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.