ఈటీవీ భారత్ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో న్యూస్ యాప్‌ను తీసుకురావడం గొప్ప విషయమని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను హత్తుకుంటోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ సంప్రదాయాన్ని, సంస్కృతిని, అన్ని వార్తలను చాలా చక్కగా వివరిస్తోందని తెలిపారు.
ఈటీవీ భారత్ ఒక అద్భుతమైన రూపకల్పన అని పేర్కొన్నారు. దేశంలోని ఎక్కడి నుంచైనా వార్తలు చూసే అవకాశం కల్పించిన రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుకు దత్తాత్రేయ ధన్యవాదాలు తెలిపారు.