ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతీ ఏడాది కౌలు చెల్లింపులో ఆలస్యమెందుకవుతోంది?: హైకోర్టు - mandadam petition heard by high court

రైతుల వార్షిక కౌలు చెల్లింపు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. మందడం రైతు ఈ అంశంపై పిటీషన్ దాఖలు చేశారు. కౌలు చెల్లింపులో ప్రతీ ఏడాది ఆలస్యం ఎందుకు అవుతోందంటూ హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

hiigh court heard lease farmer problem petiton
hiigh court heard lease farmer problem petiton

By

Published : Jun 18, 2021, 7:21 PM IST

రాజధాని రైతుల వార్షిక కౌలు చెల్లిపు అంశంపై మందడం రైతు ఆలూరి యుగంధర్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. వార్షిక కౌలు రైతుల హక్కని , ప్రతీ ఏడాది కౌలు చెల్లింపులో ఆలస్యమెందుకవుతోందని ప్రభుత్వాన్ని.. ధర్మాసనం ప్రశ్నించింది . కౌలుకు సంబంధించిన జీవో జారీచేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు . ఖాతాల్లో నగదు ఎప్పుడు జమ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా న్యాయవాది నాలుగు వారాల సమయం కోరారు . మూడు వారాల్లోగా రైతుల ఖాతాలో కౌలు నగదు జమ చేయాలని హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది .

ABOUT THE AUTHOR

...view details