హుద్ హుద్ తుపాను ప్రభావిత మత్స్యకారుల కోసం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని... రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇళ్లను కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది . పూర్తి వివరాలతో కౌంటర్ చేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 16 కు వాయిదా వేసింది . హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ , జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
హుద్ హుద్ ఇళ్లు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదు? - హుద్ హుద్ ఇళ్లు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదు?
ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం కింద హుద్‌హుద్ తుపాను ప్రభావిత మత్స్యకారుల కోసం కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది.
ఎన్టీఆర్ ప్రత్యేక గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను హుద్ హుద్ తుపాను మత్స్యకార బాధితులకు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తూ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ వేశారు. వాదనలు వినిపించిన న్యాయవాది.. మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తెచ్చారు.ఇళ్లను కేటాయించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్ కు వినతి సమర్పించినా ఫలితం లేదన్నారు . ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. ఇప్పటికే నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని రాష్ట్రహౌసింగ్ కార్పొరేషన్ ఎండీ , విశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ , జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించింది . ఇళ్లు లభ్యంగా ఉంటే వెంటనే అర్హులకు ఇవ్వాలని స్పష్టంచేసింది.
ఇదీ చదవండి:పీఎం-కేర్స్ నిధులతో ఆక్సిజన్ యూనిట్లు