ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Higher education projects ప్రైవేటు సంస్థలకు ఉన్నతవిద్య ప్రాజెక్టుల అప్పగింత - రాష్ట్రంలో ప్రైవేటు చేతికి ఉన్నత విద్య

Higher education projects ఉన్నతవిద్యలో పలు కార్యక్రమాల అమలు బాధ్యతలను పొరుగుసేవల సంస్థలకు అప్పగించేందుకు ఉన్నత విద్యామండలి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ సంస్థలైన సీఎఫ్‌ఎస్‌ఎస్‌, ఈ-ప్రగతి లాంటివాటిని కాదని, ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు. సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ప్రైవేటు ఏజెన్సీలకు ఏకీకృత టెండర్ల ద్వారా పనులు అప్పగిస్తారు.

Higher education projects
ఉన్నత విద్యామండలి

By

Published : Aug 24, 2022, 9:59 AM IST

Higher education projects ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు పోలా భాస్కర్‌, నాగరాణి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్ర, ఆచార్య నాగార్జున, శ్రీవేంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల్లో దూరవిద్యలో అప్రెంటిస్‌షిప్‌ అమలు చేసేందుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌ కోర్సులను అందించి, వారికి అప్రెంటిస్‌షిప్‌ బాధ్యతలను ప్రైవేటుసంస్థకు అప్పగిస్తారు. ఈ రెండు పనులు నిర్వహించే సంస్థలకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టనున్నారు. ఎంపికైన సంస్థ విద్యార్థులకు మూడేళ్లు అప్రెంటిస్‌షిప్‌ను అందించాలి.

* విశ్వవిద్యాలయాలన్నింటికీ కలిపి ఏకీకృత కంప్యూటరీకరణ విధానం అమలు చేసే బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. దీనికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. గతంలో విశ్వవిద్యాలయాలపై ఆర్థికభారం లేకుండా ఉండేందుకు ఈ పనిని సీఎఫ్‌ఎస్‌ఎస్‌కు అప్పగించారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కొంతవరకు ప్రక్రియను పూర్తిచేశారు. ఈ సంస్థ సరిగా చేయట్లేదని ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ, సమాచార విధానం అభివృద్ధి పేరుతో దీన్ని అమలుచేస్తారు. టెండర్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుంది. ఖర్చును విశ్వవిద్యాలయాలు భరించాలి.

* ఉన్నతవిద్యలో నైపుణ్య కోర్సులు, ఇంటర్న్‌షిప్‌ల పర్యవేక్షణకు ప్రత్యేక పర్యవేక్షణ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తారు.

* అధ్యాపకులకు డిజిటల్‌ పరివర్తనపై వర్చువల్‌ శిక్షణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించే మరో ప్రాజెక్టుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

* దాతలు, పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రత్యేకంగా ఏపీ ఉన్నతవిద్య అడ్వాన్స్‌డ్‌, డెవలప్‌మెంట్‌ సొసైటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ సొసైటీ ద్వారా ఉన్నత విద్యామండలి విరాళాలు సేకరిస్తుంది. ఈ సొసైటీలోనూ కొత్త నియామకాలు చేపట్టనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details