ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

EDUCATION INSTITUTIONS: అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థల తరగతులు - Higher education institutions will reopen from October 1

రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ఉమ్మడి అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది.

Higher education classes start from October 1st
అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థల తరగతలు

By

Published : Sep 14, 2021, 7:16 AM IST

రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలను అక్టోబరు ఒకటి నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉమ్మడి అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. వారానికి ఆరు రోజులు తరగతులు జరగనున్నాయి. ఏదైనా కారణంతో ఒక రోజు తరగతులు జరగకపోతే వాటిని రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవుల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని కోర్సులకు 2022-23 అకడమిక్‌ సంవత్సరం ఆగస్టు 9న నుంచి పునఃప్రారంభ కానుంది. ఉన్నత విద్యా సంస్థల్లో 50శాతం మందికి నేరుగా, మరో 50శాతం మందికి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు. మూడు నెలల తర్వాత ఆన్‌లైన్‌ విద్యార్థులు ఆఫ్‌లైన్‌కు వస్తారు. భౌతికదూరం పాటిస్తూ వసతి గృహాలను నిర్వహించాల్సి ఉంటుంది.

సాధారణ డిగ్రీ, పీజీ కళాశాలల్లో తరగతులు ఇలా..

  • సెమిస్టర్‌-1,3,5 : అక్టోబరు 1
  • పరీక్షలు: జనవరి 24 నుంచి
  • సెమిస్టర్‌-2,4,6 : ఫిబ్రవరి 15
    పరీక్షలు: జూన్‌ 1
    (రెండో సెమిస్టర్‌ తర్వాత కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టుకు, నాలుగో సెమిస్టర్‌ తర్వాత వేసవి ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌కు 8 వారాల సమయం ఉంటుంది.)

టెక్‌, బీ ఫార్మసీ కోర్సులకు తరగతులు..

  • సెమిస్టర్‌-1,3,5,7: అక్టోబరు 1
  • సెమిస్టర్‌-3 పరీక్షలు: జనవరి 24
  • 1,5,7 ముగింపు పరీక్షలు: ఫిబ్రవరి 7
  • సెమిస్టర్‌-2,6,8 పునః ప్రారంభం: మార్చి1
  • ముగింపు పరీక్షలు: జూన్‌ 23
  • నాలుగో సెమిస్టర్‌ ప్రారంభం: ఫిబ్రవరి 15
  • పరీక్షలు: జూన్‌1
    (నాలుగో సెమిస్టర్‌ తర్వాత కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టుకు 8వారాల సమయం)
  • పీజీ కోర్సులకు నవంబరు ఒకటి నుంచి తరగతులు
  • సెమిస్టర్‌-1,3,5 పరీక్షలు: మార్చి1
  • 2,4,6 తరగతులు: మార్చి 14
    ముగింపు పరీక్షలు: జులై 4

ABOUT THE AUTHOR

...view details