ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో ప్రవేశపరీక్షల తేదీలు ఖరారు - హైదరాబాద్​ వార్తలు

తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేసింది. అలాగే పరీక్షలకు సంబంధించిన సిలబస్​ను నిర్ణయించింది.

Higher Education
తెలంగాణలో ప్రవేశపరీక్షల తేదీలు ఖరారు

By

Published : Feb 12, 2021, 4:59 PM IST

తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ ప్రకటించింది. జులై 5 నుంచి 9 వరకు టీఎస్‌ ఎంసెట్‌, జులై 1న ఈసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్‌ 20న పీజీఈసెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన ఉన్నత విద్యామండలి.. ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీలాసెట్‌ తేదీలపై నిర్ణయం తీసుకోలేదు.

ఎంసెట్​లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70 శాతం.. మొదటి సంవత్సరంలో పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే నిర్ణయించింది. జేఈఈ తరహాలోనే ఈ ఏడాది ఎంసెట్​లో ఛాయిస్ ఇవ్వనున్నారు. ఎన్ని ప్రశ్నలు అదనంగా ఇవ్వాలో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ యథాతథంగా కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి తెలిపింది.

ఇదీ చదవండి:జోగి రమేశ్.. పార్టీ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details