తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణంపై ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా అని... ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆస్పత్రి పునర్ నిర్మించాలంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తారో లేదా పునరుద్ధరిస్తారో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు... ప్రభుత్వ వైఖరిని నాలుగు వారాల్లోగా చెప్పాలని ఆదేశించింది. వారసత్వ కట్టడాలను కూల్చొద్దన్న వాదనను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఆస్పత్రి స్థలం ప్లానుతో పాటు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తారా..? పునరుద్ధస్తారా..?: హైకోర్టు - Telangana news
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తారా? లేదా పునరుద్ధస్తారా? అనే అంశంపై నాలుగు వారాల్లోగా చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రి స్థలం ప్లానుతో పాటు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రి భవనం స్థానంలో ఆధునిక వసతులతో రెండు బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఆరేళ్లు గడిచినా.. ఆ దిశగా అడుగులు పడటంలేదు. వారసత్వ భవనంగా గుర్తింపు ఉండడంతో.. నూతన భవన నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం... ఆస్పత్రిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించింది. సర్కారు వైఖరేంటో నాలుగు వారల్లోగా చెప్పాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: