హైకోర్టులో విశాఖ వైద్యుడు సుధాకర్ కేసు విచారణ జరిగింది. సుధాకర్ కేసులో తుది నివేదిక గత నెల 25న సమర్పించామని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. విచారణ పూర్తి చేసి ఒక నిర్ణయానికి వచ్చామని.. ఈ కేసు దర్యాప్తు నివేదికలో అన్ని విషయాలు పొందుపరిచామని న్యాయస్థానానికి విన్నవించారు. తదుపరి విచారణ ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.
వైద్యుడు సుధాకర్ కేసులో నివేదిక సమర్పించామన్న సీబీఐ - వైద్యుడు సుధాకర్ కేసులో హైకోర్టులో విచారణ వార్తలు
విశాఖ వైద్యుడు సుధాకర్ కేసు విచారణలో గత నెల 25న నివేదిక సమర్పించామని సీబీఐ.. హైకోర్టుకు తెలిపింది. దీనిపై నేడు విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు