ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ ఆర్టీసీ సమ్మె..ప్రభుత్వం, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి - GOVT

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో అక్కడి ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం, యూనియన్ల వాదనలు విన్న ధర్మాసనం కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. సమ్మెపై యూనియన్లు, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో చెప్పాలన్న హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వం, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి

By

Published : Oct 15, 2019, 7:02 PM IST

Updated : Oct 16, 2019, 6:36 AM IST

తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వం, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం సుమారు 75 శాతం బస్సులు నడుస్తున్నాయని... త్వరలో మిగతా బస్సులు పునరుద్ధరిస్తామని తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే.. విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు 4వేల బస్సులు నడవడం లేదని... ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి 4 వేల బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను ఎలా తెస్తారని ప్రశ్నించింది.

సమ్మె ప్రారంభమయ్యాక ప్రభుత్వం తీసుకున్న బాధ్యతాయుతమైన నిర్ణయం ఏంటని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రకటనలు సమస్యను మరింత క్లిష్టం చేసేలా ఉన్నాయే కానీ... పరిష్కరించేలా లేవని బెంచ్​ అసంతృప్తి వ్యక్తం చేసింది.

విలీనం చేస్తే మిగతా కార్పోరేషన్లు డిమాండ్​ చేస్తాయి: తెలంగాణ ప్రభుత్వం
ఆర్టీసీ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ఒకవేళ ఆర్టీసీని విలీనం చేస్తే... మిగతా కార్పొరేషన్లు కూడా డిమాండ్ చేస్తాయని తెలిపింది.

చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు: తెలంగాణ ఆర్టీసీ ఐకాస
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ సెల్ఫ్ డిస్మిస్ అని బెదిరిస్తోందని యూనియన్​ నాయకులు హెకోర్టుకు తెలిపారు. న్యాయమైన డిమాండ్ల కోసం చట్టాన్ని ఉల్లంఘించవచ్చా అని యూనియన్లను హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులపై ఎస్మా చట్టం ఎందుకు అమలు చేయకూడదో చెప్పాలని యూనియన్లను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. డిమాండ్లు న్యాయ సమ్మతం అయినప్పటికీ.. పండగ సమయంలో రవాణా నిలిపివేస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని యూనియన్లు న్యాయమూర్తికి తెలిపాయి. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటిస్తే పరిస్థితేంటని ధర్మాసనం ప్రశ్నించింది.

సమ్మె విరమించాలి: హైకోర్టు
ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన నాటి నుంచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు తెలిపింది. పిల్లలు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఉందని... పరిస్థితులు గమనించి సమ్మె విరమించాలని యూనియన్​ నాయకులకు హైకోర్టు సూచించింది. సమ్మె పరిష్కారానికి యూనియన్లు, ప్రభుత్వం చొరవ చూపాలని హైకోర్టు తెలిపింది.

ఈ కథనం చదవండి: పిల్లలకు స్మార్ట్​ ఫోన్​ ఇస్తున్నారా... జర భద్రం

Last Updated : Oct 16, 2019, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details