మహిళా ఐకాస అమరావతి రథోత్సవ యాత్ర ఉద్రిక్తంగా మారింది. అమరావతి రథోత్సవం నుంచి తిరిగి వస్తున్న ఎంపీ సురేశ్ వాహనాన్ని లేమల్లె వద్ద రాజధాని మహిళలు అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని చుట్టుముట్టి జై అమరావతి నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో అక్కడకు చేరుకున్న వైకాపా కార్యకర్తలు... మహిళలను పక్కకు నెట్టేసి ఎంపీని పంపించారు. రాజధాని మహిళలు యాత్రగా వచ్చిన బస్సును చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని 20 మంది మహిళలను అమరావతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అమరలింగేశ్వర స్వామి రథోత్సవానికి వచ్చిన రాజధాని రైతులు, మహిళలు పోలీస్ స్టేషన్‌కు చేరుకోవటంతో అరెస్ట్ చేసిన మహిళలను పెదకూరపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మళ్లీ అమరావతి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ రైతులు, మహిళలు అమరావతి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఎంపీ అనుచరులు మహిళల పట్ల దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా మహిళలను అరెస్ట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిలో ఉద్రిక్తత... 20మంది మహిళలు అరెస్ట్ - మహిళా ఐకాస నేతల అరెస్ట్
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మహిళా ఐకాస తలపెట్టిన అమరావతి రథోత్సవ యాత్ర ఉద్రిక్తంగా మారింది. జై అమరావతి అనాలని ఎంపీ సురేశ్‌ను కోరిన మహిళలపై వైకాపా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన పోలీసులు... మహిళలనే అరెస్ట్ చేశారు.
![అమరావతిలో ఉద్రిక్తత... 20మంది మహిళలు అరెస్ట్ high Tension in Amravati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6178642-988-6178642-1582471022022.jpg)
high Tension in Amravati
Last Updated : Feb 23, 2020, 11:35 PM IST