ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డ్రోన్ వివాదం... చంద్రబాబు నివాసం వద్ద లాఠీఛార్జి

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు నివాసంపై డ్రోన్ ప్రయోగించారు. పోలీసులు, తెదేపా నేతల మధ్య జరిగిన తోపులాట.. లాఠీఛార్జికి దారితీసింది.

చంద్రబాబు

By

Published : Aug 16, 2019, 11:51 AM IST

Updated : Aug 16, 2019, 3:49 PM IST

మాజీ సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత

విజయవాడ కరకట్ట వద్ద ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు చేసిన పని ఉద్రిక్తతలకు దారితీసింది. కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆయన నివాసంపైకి డ్రోన్ ప్రయోగించారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వారిని తెదేపా కార్యకర్తలు పట్టుకున్నారు. దేవినేని అవినాష్, ఇతర నాయకులు అక్కడికి చేరుకున్నారు. డ్రోన్ ఎందుకు ప్రయోగించారనే విషయాన్ని వారినడిగి తెలుసుకునేందుకు తెదేపా నేతలు యత్నించారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రోన్ ప్రయోగించిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని వీడియో తీయడానికి వారికి ఎవరు అనుమతి ఇచ్చారని తెదేపా నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఆ ఇద్దరు వ్యక్తులను స్టేషన్​కు తరలించకుండా పోలీసు జీపునకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు, తెదేపా నాయకులకు మధ్య తోపులాట జరిగింది. తెదేపా నాయకులు పోలీసు జీపు కదలకుండా చుట్టుముట్టారు. చంద్రబాబు నివాసానికి దేవినేని ఉమ, శ్రావణ్, జీవీ ఆంజనేయులు చేరుకున్నారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

కార్యకర్తలపై లాఠీఛార్జి

డ్రోన్ ప్రయోగించిన వ్యక్తులు ఎవరో చెప్పాలని తెదేపా నేతలు, కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డుగా కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, తెదేపా నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆగ్రహించిన పోలీసులు... కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో పలువురిగా గాయాలయ్యాయి. జీపుకు అడ్డుగా ఉన్నవారిని చెదరగొట్టిన పోలీసులు... డ్రోన్ ప్రయోగించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆయన చెబితేనే తీశాం

పట్టుబడిన వ్యక్తి

డ్రోన్‌ ప్రయోగించి పట్టుబడినవారు ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. జగన్ వద్ద పనిచేసే వారు తమను పంపారని నిందితులు వాగ్మూలం ఇచ్చారు. నిన్న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు కూడా తామే షూట్ చేసామని వారు తెలిపారు. జగన్ నివాసంలో ఉన్న కిరణ్ అనే వ్యక్తి ఆదేశాలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి విజువల్స్​ను డ్రోన్ ద్వారా తీస్తున్నామని పట్టుబడిన వ్యక్తులు చెబుతున్నారు.

పోలీసులకు ఫిర్యాదు

చంద్రబాబుఇంటిపై డ్రోన్‌ వినియోగంపై తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌లతో దృశ్యాలు చిత్రీకరించారనిలిఖితపూర్వకంగాఆళ్లపాటి రాజా,అశోక్‌బాబు, జనార్దన్‌ ఫిర్యాదు అందజేశారు.

Last Updated : Aug 16, 2019, 3:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details