ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాత్రికి రాత్రే ఇళ్లను తొలగించేందుకు అధికారుల యత్నం.. బాధితుల ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌లో రాత్రికిరాత్రే అధికారులు ఇళ్లు తొలగించటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇళ్లలో ఉన్న సామాన్లు బయటకు తీసేందుకు కూడా సమయమివ్వలేదని.. కూల్చివేత ఆపాలంటూ విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందారు. కొందరు బాధితులు ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో.. అధికారులతో స్థానికులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

houses demolition in amarareddy nagar
అమరారెడ్డినగర్‌లో ఇళ్ల కూల్చివేత

By

Published : Jul 22, 2021, 10:01 AM IST

అమరారెడ్డి నగర్​లో రాత్రికిరాత్రే ఇళ్లను తొలగించేందుకు అధికారుల యత్నం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌లో రాత్రికిరాత్రే అధికారులు ఇళ్లు తొలగించటం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల సాయంతో.. నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేత ప్రారంభించారు. ఇళ్లలో ఉన్న సామాన్లు బయటకు తీసేందుకైనా సమయం ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగేలా చూడాలంటూ ఇటీవలే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసిన శివశ్రీ ఇంటిని సైతం తొలగిస్తుండగా.. ఆమె అమ్మకు గుండెపోటు వచ్చి కింద పడిపోయారు.

ఆమెను అప్పటికప్పుడు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కూల్చివేత ఆపాలంటూ.. జేసీబీకి అడ్డంగా పడుకున్న వాళ్లను.. అధికారులు అక్కడినుంచి లాగి బయటకు పంపించారు. ఆగ్రహానికి గురైన బాధితులు.. ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకునేందుకు యత్నించారు. అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేత ఆపాలని.. తెలుగుదేశం నేతలు, వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేసినా.. అధికారులు ఎవరినీ పట్టించుకోలేదు.

ABOUT THE AUTHOR

...view details