ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PM Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్​ టూర్.. 7 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత - ఇక్రిశాట్ స్వర్ణోత్సవంలో ప్రధాని మోదీ

PM Modi Hyderabad Tour : ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ రానున్న తరుణంలో బందోబస్తు ఏర్పాట్లలో హైదరాబాద్​ పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. 7 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు. రేపు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు మోదీ రానున్నందున భద్రతా చర్యలపై రాష్ట్ర పోలీసులతో ఎస్పీజీ సమన్వయం చేసుకుంటోంది.

మోదీ హైదరాబాద్​ టూర్
మోదీ హైదరాబాద్​ టూర్

By

Published : Feb 4, 2022, 3:33 PM IST

మోదీ హైదరాబాద్​ టూర్

PM Modi Hyderabad Tour : ప్రధాని నరేంద్ర మోదీ రేపు (శనివారం) తెలంగాణ రానున్న తరుణంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 7 వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్​లో ఇక్రిశాట్​కు చేరుకుని స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్​లో నేరుగా ముచ్చింతల్ వెళ్లి అక్కడ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.

PM Modi Visits Hyderabad : మోదీ రాక సందర్భంగా.. శ్రీరామనగరంలో అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని భద్రతా చర్యలను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు.. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో పలుసార్లు సమీక్షించారు. శ్రీరామనగరంలో కార్యక్రమం ముగిశాక శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ.. రహదారి మీదుగా చేరుకుంటారు. ఇటీవల పంజాబ్​లో ప్రధాని కాన్వాయ్​ను అడ్డుకున్న ఘటన దృష్ట్యా.. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోదీ వెళ్లే సమయంలో ఆ రహదారి మీదుగా ఇతర వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. ప్రధాని కార్యక్రమంపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.

Security Tightens in Hyderabad : ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను.. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి తెలంగామ సీఎస్​, డీజీపీ పరిశీలించారు. ఫిబ్రవరి 5న ప్రధాని, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా 7 వేలమందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఇక్రిశాట్, ముచ్చింతల్, శంషాబాద్ విమానాశ్రయం వద్ద పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏ ఆటంకాలు లేకుండా ప్రముఖుల పర్యటనకు ప్రణాళిక చేసినట్లు చెప్పారు. ఒకే చోట నుంచి భద్రత పర్యవేక్షణకు కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు.

ప్రధాని మోదీ హైదరాబాద్​ పర్యటన ఇలా సాగనుంది

  • మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు
  • అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఇక్రిశాట్​కు వెళ్లి.. స్వర్ణోత్సవంలో పాల్గొంటారు
  • సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్​లో ముచ్చింతల్​లోని శ్రీరామనగరానికి వెళ్తారు
  • అతిథి గృహంలో 10 నిమిషాలు రీప్రెష్ అయి యాగశాలకు చేరుకుంటారు
  • యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడి పూజ చేస్తారు
  • సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు
  • సమతామూర్తి విగ్రహం వద్ద సుమారు అరగంట పాటు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు
  • మోదీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శన ఉంటుంది
  • అనంతరం.. మరోసారి యాగశాలకు చేరుకుని ఆరోజు నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ యాగానికి పూర్ణాహుతి పలుకుతారు
  • 5వేల మంది రుత్వికులు ప్రధాని మోదీకి వేద అశీర్వచనం ఇస్తారు
  • ఆ తర్వాత రహదారి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వెళ్తారు
  • అక్కణ్నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంటారు

ఇదీ చదవండి :Ramanuja Sahasrabdi Utsav : ప్రపంచంలోనే అద్భుత పర్యాటక కేంద్రంగా సమతామూర్తి కేంద్రం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details