నిపుణుల కమిటీ, బీసీజీ (బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్) నివేదికపై అధ్యయనం చేసేందుకు.. హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, గౌతంరెడ్డి, కన్నబాబు, సుచరిత, మోపిదేవి, కొడాలి నాని, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతం సవాంగ్, వీరపుకుమార్ ప్రసాద్ ఉంటారు. హైపవర్ కమిటీ సభ్య కన్వీనర్‌గా సీఎస్ నీలం సాహ్ని ఉంటారు. ఈ కమిటీ నివేదికలపై అధ్యయనం చేసి సిఫారసులు చేస్తుంది. రాజధాని, ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ నివేదికలపై.. కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
బీసీజీ నివేదికపై అధ్యయనానికి హైపవర్ కమిటీ - బీసీజీ నివేదికపై అధ్యయనానికి హైపవర్ కమిటీ
మూడు రాజధానులపై మరో కమిటీ ఏర్పాటైంది. నిపుణుల కమిటీ, బీసీజీ నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
హైపవర్ కమిటీ ఏర్పాటు
Last Updated : Dec 29, 2019, 12:20 PM IST