రేపు ఉదయం 10.30 గంటలకు మరోసారి హైపవర్ కమిటీ భేటీ కానుంది. తొలి సమావేశంలో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ జరగాలని తొలి సమావేశంలో అభిప్రాయపడ్డ కమిటీ... రెండో భేటీలో రాజధాని ప్రాంత రైతులు, అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. రాజధాని రైతుల ముందుకు కొన్ని ప్రతిపాదనలు పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. సమీకరణకు భూములిచ్చిన రైతులను సంతృప్తిపరిచేలా నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి. జిల్లాలు, ప్రాంతాల వారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.
రేపు హైపవర్ కమిటీ భేటీ.. రాజధాని రైతులు, అభివృద్ధిపై చర్చ! - high power committe on capital city
తొలి భేటీలో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డ హైపవర్ కమిటీ.. రేపు ఉదయం 10.30 గంటలకు మరోసారి సమావేశం కానుంది.
High Power Committee Second Meeting