హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్‌తో ఇవాళ సమావేశం కానుంది. ఉదయం పదిన్నరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ప్రభుత్వం నిర్దేశించిన పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించేందుకు ఇప్పటికే 3 సార్లు కమిటీ సమావేశమైంది. తమ సిఫార్సులకు సంబంధించిన వేర్వేరు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఈ భేటీ అనంతరం మూడు రాజధానుల అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీఎంతో సమావేశం తర్వాత రైతుల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకోనున్న కమిటీ.. 18 లేదా 20వ తేదీన ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో... హైపవర్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు.
నేడు ముఖ్యమంత్రితో హైపవర్ కమిటీ భేటీ - జీఎన్ రావు కమిటీ న్యూస్
జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నేడు ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం కానుంది. ఇప్పటికే మూడుసార్లు కమిటీ సమావేశమైంది.
high power committe meet cm jagan today
ఇదీ చదవండి: భాజపా, జనసేన ఐక్యగళం- అమరావతి నుంచే తొలి ఉద్యమం