ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి' - హైకోర్టు వార్తలు

రాష్ట్రంలో జిల్లా పోలీసు కంప్లైంట్ అథార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను అదేశించింది.

high court
high court

By

Published : Apr 20, 2022, 3:53 AM IST

పోలీసులపై వచ్చే ఫిర్యాదులను అందుకుని వాటిని పరిష్కరించే నిమిత్తం రాష్ట్రంలో జిల్లా పోలీసు కంప్లైంట్ అథార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , హోంశాఖ ముఖ్యకార్యదర్శి , డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

పోలీసు కంప్లైంట్ అథార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ విశాఖపట్నానికి చెందిన న్యాయవాది ఎం.మనోజ్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కె.సింహాచలం వాదనలు వినిపించారు. ప్రకాశ్ సింగ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం .. అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర , జిల్లా స్థాయిలో పోలీసు కంప్లైంట్ అథార్టీలను ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. వివిధ రాష్ట్రాలు అథార్టీలను ఏర్పాటు చేశాయన్నారు. ఏపీలోనూ ఏర్పాటుకు గతేడాది జులై 8 న జీవో జారీచేశారన్నారు. రాష్ట్రంలోని నాలుగు జోన్లకు ఛైర్మన్లు , సభ్యులను నియమించినప్పటికీ కార్యకలాపాల నిర్వహణ కోసం కార్యాలయాలను ఏర్పాటు చేయలేదన్నారు.

ఇదీ చదవండి: 'పోలీసులపై ఫిర్యాదుల కోసం.. ఆ కార్యాలయాలను ఏర్పాటు చేయండి'

ABOUT THE AUTHOR

...view details