కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో కృష్ణాజిల్లా పూర్వ కలెక్టర్ ఇంతియాజ్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై హైకోర్టు ఇటీవల జారీ చేసిన నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకుంది. తమపై వారెంట్ రీకాల్ చేయాలంటూ అధికారులు అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జరిగిన విచారణకు స్వయంగా హాజరైన అధికారులు గత విచారణకు హాజరుకాలేకపోవడానికి కారణాలు వివరించారు.
HIGH COURT: నాన్ బెయిల్‌బుల్ వారెంట్ వెనక్కి తీసుకున్న హైకోర్టు - హైకోర్టు తాాజా వార్తలు
కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో కృష్ణాజిల్లా పూర్వ కలెక్టర్ ఇంతియాజ్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై హైకోర్టు ఇటీవల జారీ చేసిన నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకుంది. తమపై వారెంట్ రీకాల్ చేయాలంటూ అధికారులు అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
నాన్ బెయిల్‌బుల్ వారెంట్ వెనక్కి తీసుకున్న హైకోర్టు
ఈ సమాధానంపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి...వారెంట్ రీకాల్ చేశారు. చేయూత పథకానికి తాము అర్హులైన పరిగణలోకి తీసుకోవడం లేదంటూ కృష్ణాజిల్లా చందర్లపాడుకు చెందిన 20 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు కలెక్టర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హాజరుకాకపోవడంతో... హైకోర్టు ధిక్కరణగా పరిగణించి నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇదీ చదవండి: