జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ - ap high court
ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పాలనాధికారిని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి... వైకాపా రంగులు వేయడం గురించి పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ నిలదీసింది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పాలనాధికారిని హైకోర్టు ఆదేశించింది.