Private unaided colleges: 'నాలుగు వారాల్లో ఫీజులు నిర్ణయించండి' - ఏపీ అన్ ఎయిడెడ్ కళాశాలల ఫీజులుపై హైకోర్టు తీర్పు
10:55 October 07
ఫీజుల నిర్ధారణపై ప్రభుత్వ అప్పీల్‌పై తీర్పు వెలువరించిన హైకోర్టు
ప్రైవేట్ అన్ అయిడెడ్ కళాశాలల (Private unaided colleges) ఫీజుల నిర్ధారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగల్ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కనబెట్టింది. నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించేందుకు 4 వారాల సమయం ఇచ్చింది. పిటిషనర్లతో మాట్లాడి 4 వారాల్లో ఫీజులు నిర్ణయించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ డిగ్రీ కళాశాలలు యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
డిగ్రీ కళాశాలలను 3 కేటగిరీలుగా విభజించి ఫీజులు నిర్ణయించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ప్రభుత్వ జీవోను కొట్టివేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్వర్వులు ఇచ్చారు. నిబంధనల ప్రకారం నిర్ణయించే వరకు పాత ఫీజులే వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సింగిల్ జడ్జి ఉత్వర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఇరువురి వాదనలు విని న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. కాగా, ఇవాళ వెలువరించిన తీర్పులో డివిజినల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్వర్వులను పక్కనబెట్టింది.
ఇదీ చదవండి: