ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC ON WOMEN POLICE SECRETARIES: మహిళా పోలీసు కార్యదర్శుల నియామకంపై హైకోర్టులో విచారణ - ఏపీ 2021 వార్తలు

వార్డు మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

HIGH COURT RESPONDS ON  RECRUITMENT OF WOMEN SECREATARIES AS POLICE
మహిళా పోలీసు కార్యదర్శుల నియామకంపై హైకోర్టులో విచారణ

By

Published : Nov 24, 2021, 12:26 PM IST

Updated : Nov 24, 2021, 12:33 PM IST

వార్డు మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యాజ్యాలు ఉపసంహరించుకోవాలంటూ కొందరు ఒత్తిడి తీసుకువస్తున్నారని పిటిషనర్ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసుశాఖలో ‘మహిళా పోలీసులు’గా పరిగణిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 23న జారీ చేసింది. జీవో 59ని రద్దు చేయాలని కోరుతూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు అక్టోబర్ 22న వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Last Updated : Nov 24, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details