ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల పిటిషన్​పై ముగిసిన వాదనలు...తీర్పు రిజర్వు - పంచాయతీ ఎన్నికల వాయిదాపై హైకోర్టులో పిటిషన్

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్​ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్​పై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్​పై వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.

High court
High court

By

Published : Dec 4, 2020, 6:19 PM IST

గ్రామ పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) జారీచేసిన ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా ఎస్‌ఈసీ నవంబర్‌ 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను.. ప్రభుత్వం కోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్​పై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.

ABOUT THE AUTHOR

...view details