ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GANESH IMMERSION: 'హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా?' - తెలంగాణ వార్తలు

తెలంగాణలో హైదరాబాద్​లో జరగబోయే గణపతి నిమజ్జనోత్సవ నివేదిక ఇచ్చే తీరికే హైదరాబాద్ సీపీకి(hyderabad cp) లేదా? అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక నిమజ్జనం ఆంక్షలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు రిజర్వు చేసింది.

highcourt on ganesh  immersion
సీపీపై ధర్మాసనం ఆగ్రహం

By

Published : Sep 7, 2021, 5:14 PM IST

తెలంగాణలో హైదరాబాద్​లో జరగనున్న వినాయక నిమజ్జన(ganesh immersion) సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లు ఉందని ఆ రాష్ట్ర హైకోర్టు(ts high court) వ్యాఖ్యానించింది. 10 నిమిషాల ముందు నివేదిక ఇచ్చిన జీహెచ్‌ఎంసీపై(ghmc) అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి(hyderabad cp) నివేదిక ఇచ్చే తీరికే లేదా? అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక నిమజ్జనం ఆంక్షలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు రిజర్వు చేసింది.

పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవట్లేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. జనం గుమిగూడకుండా ఏం చేస్తున్నారో చెప్పట్లేదని అసహనం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీలో 48 చెరువుల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తెలిపింది. మట్టి గణపతులను(eco friendly ganesh) ప్రోత్సహిస్తున్నామన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం... లక్ష మట్టి విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొంది. సలహాలు కాదు.. చర్యలు, మార్గదర్శకాలు ఉండాలని తెలంగాణ ధర్మాసనం సూచించింది. నిమజ్జన ఆంక్షలు, నియంత్రణలపై తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:Vinayaka Chavithi controversy: చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు.. తగ్గేదేలేదంటున్న విపక్షాలు!

ABOUT THE AUTHOR

...view details