ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలులో హైకోర్టుకు చట్టం ఎలా చేస్తారు? : హైకోర్టు - ap high court latest news

ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ను... రాజధాని అమరావతిలో నోటిఫై చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చాక..న్యాయ రాజధాని పేరుతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పాలన వికేంద్రీకరణ చట్టం ఎలా చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ఐతే కర్నూలులోన్యాయ రాజధాని ఏర్పాటు ప్రతిపాదన మాత్రమేనని....రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వివరణ ఇచ్చారు. చట్టం చేసి ప్రతిపాదన అని ఎలా చెబుతారని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. మంగళవారం జరిగిన విచారణలో పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడం వల్ల విచారణను హైకోర్టు..... బుధవారానికి వాయిదా వేసింది.

జుడీషియల్ ప్రివ్యూ ఏర్పాటు చేస్తే తప్పేంటి: హైకోర్టు
జుడీషియల్ ప్రివ్యూ ఏర్పాటు చేస్తే తప్పేంటి: హైకోర్టు

By

Published : Dec 8, 2020, 6:44 AM IST

Updated : Dec 9, 2020, 4:03 AM IST

రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై హైకోర్టు రోజువారీ...... తుది విచారణ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ ..రాజధాని నిర్ణయం రాష్ట్ర శాసన వ్యవస్థకు చెందినదని వివరించారు. రాజధాని విషయంలో పార్లమెంట్ కు సంబంధం లేదని...ఏపీ విభజన చట్టంలో సైతం నిర్ణయాధికారం రాష్ట్రానికే ఇచ్చిందన ఆయన వాదించారు. మూడు రాజధానులకు సంబంధించి చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని పిటిషనర్లు చెప్పడం సరికాదని వాదించారు. ప్రభుత్వాలు శాసనాలు చేసేది ప్రజల ప్రయోజనార్థం కోసమేనని... ప్రజలకు ఏది మంచిదైతే ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. రాజధాని ఏర్పాటు విషయం పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని..మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు.

పిటిషనర్లు సదుద్దేశంతో కోర్టును ఆశ్రయించలేదని... రాజధాని మారిస్తే వారి భూములకు అధిక ధరలు దక్కవనే ఆందోళన చెందుతున్న వారే ఆశ్రయించారని దుష్యంత్‌ దవే పేర్కొన్నారు. . రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని..ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం...... అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని వాదించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం... గత ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసిందని సీనియర్ న్యాయవాది దవే తెలిపారు.

ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్ ను రాజధాని అమరావతిలో నోటిఫై చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చాక కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పాలన వికేంద్రీకరణ చట్టం ఎలా చేస్తారని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కర్నూలులో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు మాత్రమే ప్రారంభించిందని అది ప్రతిపాదన మాత్రమేనని తెలిపారు. చట్టం చేసి ఇప్పుడు ప్రతిపాదన అని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దవే బదులిస్తూ....ప్రధాన బెంచ్ ఏర్పాటు అంశానికి అంతిమంగా రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుందని అన్నారు.

మండలి చైర్మన్ బిల్లులను సెలక్ట్‌ కమిటీకి సిఫారసు చేశాకా.....వాటిని శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టి పాస్ చేయడం సభ వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించడమేకదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది స్పందిస్తూ..శానససభను చట్టాలు చేయకుండా శాసనమండలి నిలువరించలేదన్నారు. శాసనసభ ఎన్నికైన బాడీ అని .. మండలి పెద్దల సభ మాత్రమేనన్నారు . సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయకుండా శాసనమండలి కార్యదర్శి జాప్యం చేశారని పిటిషనర్లు వాదనలు వినిపించారని ఆ విషయంపై ఏం సమాధానం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లులు చట్ట రూపం దాల్చకుండా జాప్యం చేయడం కోసం చైర్మన్ యత్నించారని దవే కోర్టుకు తెలిపారు. పూర్తి స్థాయి వాదనలకు సమయం లేక పోవడం వల్ల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ బుధవారానికి వాయిదా వేసింది.ఇదీ చదవండి

లబ్ధిదారులకు నచ్చిన రీతిలో ఇళ్ల నిర్మాణం: సీఎం జగన్

Last Updated : Dec 9, 2020, 4:03 AM IST

ABOUT THE AUTHOR

...view details