ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీజీ మెడికల్​ కౌన్సెలింగ్​: ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు - high court orders on pg medical councelling news

పీజీ మెడికల్​ కౌన్సెలింగ్​ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై హైకోర్టు విచారించింది. ప్రభుత్వ ఆదేశాల వల్ల ఓసీ అభ్యర్థులు ఓపెన్​ కేటగిరీలో సీట్లు కోల్పోతారని.. దీనిపై స్టే ఇవ్వాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పూర్తి వివరాలతో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

పీజీ మెడికల్​ అంశంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
పీజీ మెడికల్​ అంశంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు

By

Published : Jun 2, 2020, 3:50 PM IST

పీజీ మెడికల్ కౌన్సెలింగ్​కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నూతన జీవోలను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. 57, 58 జీవోలను అమలు చేస్తే ఓసీ అభ్యర్థులు ఓపెన్​ కేటగిరీలో సీట్లు కోల్పోతారని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.

ఈ అంశంపై పూర్తి వివరాలతో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్​ 18కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details