ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తితిదే ఆస్తుల అమ్మకం'పై విచారణ 3 వారాలకు వాయిదా - ttd assets sale case

తితిదే ఆస్తుల అమ్మకాల అంశంపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఆస్తుల వేలం చట్ట విరుద్ధమన్న న్యాయవాది బాలాజీ.. భవిష్యత్తులో దేవస్థానం ఆస్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

తితిదే ఆస్తుల అమ్మకంపై విచారణ 3 వారాలకు వాయిదా
తితిదే ఆస్తుల అమ్మకంపై విచారణ 3 వారాలకు వాయిదా

By

Published : May 28, 2020, 12:25 PM IST

Updated : May 28, 2020, 3:02 PM IST

తితిదే ఆస్తుల అమ్మకాల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. తితిదే ఆస్తులను వేలం వేయడం చట్ట విరుద్ధమని న్యాయవాది బాలాజీ వాదించారు. భవిష్యత్తులో దేవస్థానం ఆస్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరారు

తితిదే ఆస్తులను అధికార వెబ్​సైట్​లో పెట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ఆస్తులు వేలం వేయట్లేదు

తితిదే ఆస్తుల వేలం వేయట్లేదని తితిదే స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు డా. మజ్జి సూరిబాబు తెలిపారు. వెబ్‌నార్‌ ద్వారా ఆస్తుల వివరాలు, తితిదే నిర్ణయాలను హైకోర్టుకు వివరించారు. సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్టాండింగ్‌ కమిటీ సభ్యుడికి హైకోర్టు సూచించింది.

ఇదీ చూడండి:

రంగుల అంశంపై హైకోర్టుకు సీఎస్​, పంచాయతీ ముఖ్య కార్యదర్శి

Last Updated : May 28, 2020, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details