రాజధానికి చెందిన అన్ని పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
'రాజధాని' పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా - అమరావతిపై హైకోర్టులో విచారణ వార్తలు
రాజధానికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సీఆర్‌డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లు, కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపు పిటిషన్లపై విచారణను వచ్చే నెల 30వ తేదీకి వాయిదా వేసింది. జీఎన్ రావు, బోస్టన్ కమిటీల నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌పై మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
!['రాజధాని' పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా high-court-petitions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6207907-thumbnail-3x2-court.jpg)
high-court-petitions