ప్రకాశం జిల్లా కందుకూరు పురపాలక సంఘ అధికారులకు హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. కందుకూరు మున్సిపాలిటీ ఇచ్చిన నోటీసులను సస్పెండ్ హైకోర్టు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అసలేం జరిగిందంటే.. మహదేవపురంలోని మన్నం గోపి అనే వ్యక్తికి రూ.13 లక్షలు పన్ను చెల్లించాలని కందుకూరు మున్సిపాలిటీ పన్ను నోటీసులు జారీ చేసిసింది. పన్ను చెల్లించకపోతే సామాన్లు బయటవేస్తామని అధికారులు హెచ్చరించారు. తన ఇల్లు మున్సిపాలిటీ పరిధిలోకి రాదని గోపి.. హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించగా... కందుకూరు మున్సిపాలిటీ ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. 3వ వంతు మొత్తం.. పన్ను రూపంలో పంచాయితీకి చెల్లించాలని గోపిని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Dharmana Krishnadas: 'జగన్ మళ్లీ సీఎం కాకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటాం'
కందుకూరు పురపాలక సంఘ అధికారులకు హైకోర్టు ఆదేశాలు
కందుకూరు పురపాలక సంఘ అధికారులకు హైకోర్టు ఆదేశాలు
13:59 March 29
రూ.13 లక్షల పన్ను నోటీసులను సస్పెండ్ చేసిన హైకోర్టు
Last Updated : Mar 29, 2022, 4:04 PM IST
TAGGED:
prakasam latest updates