ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మిషన్‌ బిల్డ్‌ ఏపీ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం - మిషన్​ బిల్డ్ ఏపీపై కోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు

high court on mission build ap
మిషన్‌ బిల్డ్‌ ఏపీ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

By

Published : Dec 30, 2020, 2:10 PM IST

Updated : Dec 30, 2020, 4:00 PM IST

14:08 December 30

కోర్టు ధిక్కారం అభియోగాల కింద కేసు

న్యాయవాది నర్రా శ్రీనివాసరావుతో ముఖాముఖి

మిషన్‌ బిల్డ్‌ ఏపీ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశించింది. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కింద కేసు దాఖలుకు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానానికి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని హైకోర్టు ‌అసహనం వ్యక్తం చేసింది.  

                  మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ స్థలాలను విక్రయించటాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్లపై జరుగుతున్న విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం వేసిన రిక్వెజేషన్ పిటిషన్​పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్​లో తప్పులున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రప్రభుత్వం తరపున దాఖలు చేసిన ఈ పిటిషన్లో న్యాయమూర్తి చేయని వ్యాఖ్యలను చేసినట్లు అఫిడవిట్లో నమోదు చేయడంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిక్విజల్ పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్​ను ప్రాసిక్యూట్ చేయాలని జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిశ్ రమేశ్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించ కూడదో తెలపాలంటూ మిషన్ బిల్డ్ ఏపీ అధికారి ప్రవీణ్ కుమార్​కు షోకాజు నోటీసు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రవీణ్ పై కాంపిటెంట్ కోర్టులో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసు నమోదు చేయాలని రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి రెండవ వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

ఇదీ చదవండి: '25 లక్షల ఇళ్లు ఇస్తామన్నాం.. 30 లక్షలకు పైగా ఇవ్వబోతున్నాం'

Last Updated : Dec 30, 2020, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details