ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC On IAS Officers: కోర్టు ధిక్కరణ కేసు.. ఐఏఎస్ అధికారుల హాజరుకు హైకోర్టు ఆదేశం - high court latest news

hc on ias officers: కోర్టు ధిక్కరణ కేసులో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ జనవరి 7న వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

hc on ias officers
hc on ias officers

By

Published : Dec 17, 2021, 4:02 AM IST

Updated : Dec 17, 2021, 8:02 AM IST

HC on ias officers: కోర్టు ధిక్కరణ కేసులో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ జనవరి 7న వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ ఉత్తర్వులిచ్చారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎందుకు శిక్షించకూడదో చెప్పాలంటూ ఫామ్-1 నోటీసు జారీ చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారుల విషయంలో వ్యవసాయశాఖ జారీచేసిన మెమోపై తదుపరి చర్యలను నిలిపేస్తూ గతేడాది అక్టోబర్ 5న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉల్లంఘించారంటూ గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం.వేణుగోపాల్ , జేఎన్ వెంకటగోపాల్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.

Last Updated : Dec 17, 2021, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details