ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండు రోజుల్లో కౌలు చెల్లించండి : హైకోర్టు - హైకోర్టు తాజా వార్తలు

రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. రెండు రోజుల్లో వార్షిక కౌలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

high court orders government to pay lease money to amaravathi farmers
రెండు రోజుల్లో కౌలు చెల్లించండి : హైకోర్టు

By

Published : Aug 28, 2020, 8:25 AM IST

రాజధాని ప్రాంత రైతులకు రెండు రోజుల్లో వార్షిక కౌలు చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. గంగారావు ఉత్తర్వులు జారీచేశారు. వార్షిక కౌలు చెల్లింపులో జాప్యాన్ని సవాలు చేస్తూ రైతులు కారుమండి పకీరయ్య , ఇడుపులపాటి సీతారామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం సకాలంలో కౌలు చెల్లించకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది ఇంద్రనీల్ బాబు కోర్టు దృష్టికి తెచ్చారు.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ .. వార్షిక కౌలు చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. రెండు రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details