ఈనెల 27న కోర్టుకు హాజరుకావాలని డీజీపీ, హోం సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ అధికారికి పదోన్నతిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని పిటిషన్ పై విచారణ జరిగింది. కోర్టు ధిక్కారం కింద ఇద్దరూ హాజరుకావాలని గతంలోనే ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని అధికారుల అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈనెల 27న హాజరుకావాల్సిందే.. హై కోర్టు ఆదేశం! - డీజీపీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు
![ఈనెల 27న హాజరుకావాల్సిందే.. హై కోర్టు ఆదేశం! ఈనెల 27న హాజరుకావాల్సిందే.. హై కోర్టు ఆదేశం!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10370662-733-10370662-1611560220630.jpg)
ఈనెల 27న హాజరుకావాల్సిందే.. హై కోర్టు ఆదేశం!
12:22 January 25
.
డీజీపీ, హోం సెక్రటరీ అఫిడవిట్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం నిర్ణయం వచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని సీఎస్ కోరారని.. డీజీపీ, హోం సెక్రటరీ ఎన్నికల విధులని చెప్పడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 27న డీజీపీ, హోం సెక్రటరీ హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి:
Last Updated : Jan 25, 2021, 1:08 PM IST